నా పేరు వెనుక చాలా కథ ఉంది..ప్రేమలు హీరోయిన్

Mamitha-baiju.jpg

యంగ్ బ్యూటీ మమితా బైజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తీసింది ఒక్క సినిమానే కానీ.. సౌత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. ఈ బ్యూటీకి ఇప్పుడు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన అందం, అభినయంతో తెలుగు కుర్రాళ్ల మనసు గెలుచుకుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈమె గురించే చెప్పుకుంటున్నారు. మలయాళ సినిమా ‘ప్రేమలు’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ బ్యూటీ.

తాజాగా ఓ ఇంటర్‌వ్యూలో తన పేరుకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ‘నిజానికి నా పేరు నమిత. మమిత కాదు. నేను పుట్టినప్పుడు హాస్పిటల్‌ సిబ్బంది బర్త్‌ సర్టిఫికెట్‌లో నా పేరును మమిత గా నమోదు చేశారు. నేను స్కూల్‌లో చేరేటప్పుడు ఈ పొరపాటు వెలుగుచూసింది. ఇంట్లో అందరూ షాక్‌. ఇక చేసేది లేక మమితగానే స్కూల్లో జాయిన్‌ అయ్యాను. నా మొదటి సినిమా ‘ప్రేమలు’ అని అందరూ అనుకుంటున్నారు. కానీ అది నా పదహారో సినిమా అని.. మలయాళంలో చాలా సినిమాలు చేశాను అని మమిత చెప్పింది.

Share this post

scroll to top