ఇండియన్‌-2 రీలీజ్ డేట్ ..?

indian2.jpg

కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్‌-2 చిత్రం గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని జూలై 12న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారని తెలిసింది. ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం. కమల్‌హాసన్‌ శంకర్‌ కాంబోలో వచ్చిన సంచలన చిత్రం ఇండియన్‌కు సీక్వెల్‌ ఇది. గత మూడేళ్ల నుంచి ఈ సినిమా ఎన్నో అవాంతరాలను అధిగమించి షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతున్నదని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడకుండా దర్శకుడు శంకర్‌ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ సినిమా సమకాలీన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బలమైన సామాజిక సందేశంతో ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది.

Share this post

scroll to top