సందీప్ కిషన్ హీరోగా తమిళంలో ‘మాయావన్’

Mayawan.jpg

సందీప్ కిషన్ హీరోగా తమిళంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘మాయావన్’. సీవీ కుమార్ ఈ సినిమాకి దర్శక నిర్మాతగా వ్యవహరించాడు. 2017లో ఈ సినిమా అక్కడి థియేటర్లకు వచ్చింది. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ సినిమాలో, జాకీ ష్రాఫ్ .. డేనియల్ బాలాజీ .. మైమ్ గోపి ముఖ్యమైన పాత్రలను పోషించారు.

తెలుగులో ఈ సినిమాను ‘ప్రాజెక్ట్ Z’ పేరుహో విడుదల చేశారు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ‘ఆహా’ వారు దక్కించుకున్నారు. త్వరలోనే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్న విషయాన్ని ప్రకటించారు. జిబ్రాన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు.

ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా సందీప్ కిషన్ నటించగా. సైకోథెరపిస్ట్ గా లావణ్య త్రిపాఠి కనిపించనుంది. సిటీలో వరుసగా మర్డర్ లు జరుగుతూ ఉంటాయి. ఆ మిస్టరీని ఛేదించడానికి హీరో రంగంలోకి దిగుతాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ తరువాత ఏమవుతుంది? అనేదే కథ.

Share this post

scroll to top