విశ్వంభరలో మరో సీనియర్ బ్యూటీ.?

mgstr.jpg

పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర. పాన్ ఇండియా స్థాయిలో సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష దాదాపు 18 ఏండ్ల త‌ర్వాత చిరంజీవితో క‌లిసి ఇందులో న‌టిస్తుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

ఈ సినిమాలో త్రిష‌తో పాటు మరో సీనియర్ హీరోయిన్ కూడా న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. ఈ చిత్రం రెండు పార్టులుగా రానున్న విషయం తెలిసిందే. మొద‌టి పార్ట్‌లో త్రిష క‌థానాయిక‌గా ఉండ‌గా.. రెండో భాగంలో ఓ కీలక పాత్ర కోసం సీనియర్ నటి ఖుష్బూ న‌టించ‌నున్న‌ట్లు సమాచారం. ఈ పాత్ర కోసం మొద‌ట‌గా హీరోయిన్ విజయశాంతిని సంప్రదించగా.. రాముల‌మ్మ ఒకే చెప్ప‌లేద‌ని టాక్ న‌డిచింది. ఆ త‌ర్వాత ఖుష్బూని సంపద్రించగా కథ బాగా నచ్చడంతో ఓకే చెప్పేశారనీ తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఆర్‌ఆర్‌ఆర్‌ ఫేం లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, సంగీతం అందిస్తున్నారు.

Share this post

scroll to top