వైజాగ్ లో విజయ్ దేవరకొండ!

Rowdy-boy.jpg

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఒక షెడ్యూల్ ఇటీవలే హైదరాబాద్ లో జరిగింది. ఇక్కడి అల్యూమినియం ఫ్యాక్టరీలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తరువాత షెడ్యూల్ ను వైజాగ్ లో ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ఈ సినిమా టీమ్ అక్కడే ఉంది.

ప్రధానమైన పాత్రలకు సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నట్టుగా చెబుతున్నారు. హీరోయిన్ పాత్రకి కూడా చాలా ప్రాధాన్యత ఉందని అంటున్నారు. మమిత బైజు – భాగ్యశ్రీ బోర్స్ లలో ఒకరు ఈ సినిమాలో కథానాయికగా కనిపించడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. సితార – ఫార్చూన్ ఫోర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

విజయ్ దేవరకొండను కొంతకాలంగా వరుస పరాజయాలు వెంటాడుతూ వస్తున్నాయి. ‘ఖుషి’ సినిమా అతని పరాజయాలకు బ్రేక్ వేస్తుందని భావించారు .. కానీ అలా జరగలేదు. ఇక ‘ఫ్యామిలీ స్టార్’ అయినా ఆయన నమ్మకాన్ని నిలబెడుతుందని ఆశించారు .. అక్కడ కూడా నిరాశనే మిగిలింది. ఈ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా, ఆయనకి హిట్టు పట్టుకొచ్చి పెడుతుందేమో చూడాలి.

Share this post

scroll to top