సిద్ధార్థ్‌ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది

Siddarthhh.jpg

‘ఆర్ ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ‘మహాసముద్రం’ మూవీలో కలిసి నటించిన కోలీవుడ్ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావ్ హైదరి రిలేషన్ లో వున్న విషయం మన అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఇరు కుటుంబాల అంగీకారంతో మార్చి 27న వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్‌ రంగనాథ స్వామి దేవాలయంలో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న విషయం అందరికీ తెలిసినదే..

ఇదిలావుంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సిద్దార్థ్ గురించి అదితి రావ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘సిద్ధార్థ్‌ నన్నెంతో మార్చాడు. అతడు పరిచయమయ్యాకే ప్రేమపై నమ్మకం మరింత పెరిగింది. ఎన్నో విషయాల్లో నా నమ్మకం నిజమైంది. మా ఇద్దరుపై గాసిప్స్‌ వచ్చాయి. వాటికి చెక్‌ పెట్టేందుకే నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించాం’ అని తెలిపింది.

Share this post

scroll to top