బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి సీతాదేవిగా నటిస్తున్న సినిమా రామాయణం. ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యష్ లంకేశ్ రావణుడి పాత్రలో కనిపించబోతున్నాడు. విజువల్ వండర్ గా రామాయణం చిత్రాన్ని ఆవిష్కరించాలని, నితీశ్ తివారీ టీమ్ ఎప్పటి నుంచో కసరత్తు మొదలు పెట్టింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన వార్త ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఈ మూవీ 2027 లో రిలీజ్ కానుందంట. అంటే మూడేళ్ల పాటు ఈ మూవీ షూటింగ్ జరగబోతోందని తెలుస్తోంది. రామాయణం కథతో ఇండియన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి ఉంటారు. కాబట్టి స్టోరీ నేరేషన్ లో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా అద్భుతమైన దృశ్యకావ్యంగా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో రామాయణం సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.