మరో క్రేజీ ప్రాజెక్టులో సంయుక్త మీనన్.. హీరో ఎవరంటే?

Samyuktha-menon.jpg

‘భీమ్లా నాయక్’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది సంయుక్త మీనన్. తర్వాత వచ్చిన ‘బింబిసారా’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ‘సార్, విరూపాక్ష, డెవిల్’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ‘విరూపాక్ష’ సినిమాతో నటన పరంగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.

తాజాగా తెలుగులో మరో క్రేజీ ఆఫర్ దక్కించుకుందట ఈ బ్యూటీ. టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఇటీవలే ఓ సినిమా స్టార్ట్ అయ్యింది. మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు లుధీర్ బైరెడ్డి తెరకెక్కిస్తున్నాడు. త్వరలో షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త ను ఫిక్స్ చేశారట. ప్రస్తుతం నిఖిల్ తో స్వయంభూ అనే సినిమాతో పాటు శర్వానంద్ సరసన కూడా ఓ సినిమా చేస్తోంది సంయుక్త మీనన్.

Share this post

scroll to top