సీఎం వైయస్ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజానగరం చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. సీఎం రాకతో రాజానగరం జనసంద్రమైంది. రహదారులన్నీ జనంతో కిక్కిరిపోయాయి. ప్రజాభిమానం పోటెత్తింది. మరికాసేపట్లో రాజానగరం నియోజకవర్గలోని జరిగే ప్రచార సభలో సీఎం ప్రసంగించనున్నారు.
రాజానగరం సభ అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు ఇచ్ఛాపురం మున్సిపల్ ఆఫీస్ వద్ద పబ్లిక్ మీటింగ్‌లో సీఎం వైయస్ జగన్ ప్రసంగించనున్నారు. సాయంత్రం గాజువాక నియోజకవర్గంలోని పాత గాజువాక సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.