ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైఎస్ జగన్ గెలుస్తున్నారని తమకు సమాచారం ఉందని వ్యాఖ్యానించారు. ఆయన ఈ రోజు హైదరాబాదులోని తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలపై స్పందించాలని జర్నలిస్ట్ ప్రతినిధులు కోరారు. దీంతో కేటీఆర్ పైవిధంగా స్పందించారు.