వాతావరణ శాఖ చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్..

rains-1.jpg

వేసవి తాపంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చల్లటి కబురు చెప్పింది. మే నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని అంచనా వేసింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నాలుగు రోజులు అటుఇటుగా మే 31న కేరళను తాకనున్నాయని, ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించనున్నాయని ఐఎండీ లెక్కగట్టింది. ఈ మేరకు బుధవారం అంచనాలను వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు మే 1న కేరళను తాకడం ముందస్తు కాదని, సాధారణ తేదీకి సమీపంగా ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర వెల్లడించారు.

Share this post

scroll to top