రైతులకు భారీ గుడ్ న్యూస్.. రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

revabnth-a.jpg

లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రైతు రుణమాఫీపై అధికార, ప్రతిపక్షల పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. దమ్ముంటే రూ.2 లక్షల హామీ చేయాలంటూ మాజీ హరీష్‌రావు, సీఎం రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. ఒకవేళ రుణమాఫీ చేస్తే.. తాను రాజీనామా చేసేందుకైనా సిద్ధమని ప్రకటించారు. అయితే, లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో బుధవారం రాత్రి మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో సీఎం ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్‌‌రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రుణమాఫీకి సంబంధించి విధివిధానాల రూపొందించాలని సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని సీఎం చెప్పినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా రానున్న నాలుగేళ్ల కాలంలో రైతు రుణమాఫీకి సంబంధించి మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Share this post

scroll to top