ఇచ్చిన అన్ని హామీలను ఈ 59 నెలల పాలనలో పూర్తి చేశామని సీఎం జగన్ అన్నారు. అన్ని హామీలను నెరవేర్చిన మీ బిడ్డ మీ ఆశీస్సుల కోసం మరోసారి మీ ముందుకు వచ్చాడని చెప్పారు. హిందూపురంలో నిర్వహించిన ప్రచార భేరిలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరో 9 రోజుల్లో ఎన్నికల కురుక్షేత్ర యుద్ధం జరుగుతోందని చెప్పారు. ఇవి కేవలం ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎంచుకునే ఎన్నికలు మాత్రమే కాదని…. మీ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని అన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని… పథకాలు కొనసాగాలంటే వైసీపీకి ఓటు వేయాలని చెప్పారు.