జనసేన స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగారు. పవన్ కల్యాణ్ ని పిఠాపురంలో గెలిపించడానికి జబర్దస్ కమీడియన్స్ ఆది, రాంప్రసాద్, సుడిగాలి సుదీర్, డ్యాన్స్ మాస్టర్ జాని ప్రచారాలు చేస్తున్నారు. అయితే, పిఠాపురంలో ఎవరు వచ్చి ప్రచారం చేసినా ప్రజల్లో ఎలాంటి స్పందనా రావడం లేదు. దీంతో పవన్ మరోసారి ఓడిపోవడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే మెగా ఫ్యామిలీ హీరోలు కనీసం పవన్ కల్యాణ్ కోసం అయినా పిఠాపురం వస్తారేమో చూడాలి. ఫ్యామిలీ సెంటిమెంట్, మెగా స్టార్ ఇమేజ్ ని వాడుకోడానికి ఆల్రడీ చిరంజీవిని కలిసి విరాళం చెక్కు తీసుకుని వచ్చారు పవన్. తనకు పరోక్షంగా అన్నయ్య సపోర్ట్ ఉందని చెప్పుకుంటున్నారు. మరి పిఠాపురం ప్రచారంలో కూడా మెగా సందడి కనిపిస్తుందేమో చూడాలి.