బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. ఈ సందర్భంగా ఆనంద భాస్కర్ మాట్లాడుతూ… విధిలేని పరిస్థితుల్లో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే తాను ఏ పార్టీలోకి వెళతానే ఇప్పుడే చెప్పలేనన్నారు. ప్రజా ఉద్యమాల్లో మాత్రం ఉంటానన్నారు.