పోలవరం ప్రాజెక్టుపై ఏపీ ప్రజలకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ప్రాజెక్టు విషయంలో కట్టుబడి ఉన్నామని తెలిపారు. ‘పోలవరం జాతీయ ప్రాజెక్టు. దాని నిర్మాణం కోసం ఇప్పటి వరకు రూ.15వేల కోట్లను విడుదల చేశాం. నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశాం. రాష్ట్రానికి అండగా నిలిచేందుకు ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనుల్ని సమీక్షిస్తున్నాం’ అని మోదీ వివరించారు.