Tag Archives: PM Modi

ప్రతి ఓటు ముఖ్యమే: ప్రధాని మోదీ

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని మోదీ కోరారు. ‘ఇవాళ 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. రికార్డు స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నా. ముఖ్యంగా యువత, తొలిసారి ఓటు వచ్చినవారు తప్పకుండా అధిక సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనాలి. ప్రతి ఓటు, ప్రతి ఒక్కరి వాయిస్ ముఖ్యమే’ అని మోదీ ట్వీట్ చేశారు.

Read More »

తొలి దశ పోలింగ్‌కు ముందు ఎన్డీయే అభ్యర్థులకు ప్రధాని మోదీ లేఖ

లోక్‌సభ ఎన్నికలు 2024లో భాగంగా ఏప్రిల్ 19న (శుక్రవారం) తొలి దశ ఎన్నికల పోలింగ్‌కు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్డీయే అభ్యర్థులకు లేఖ రాశారు. ‘‘ఈ సారి జరుగుతున్నవి సాధారణ ఎన్నికలు కాదని ఈ లేఖ ద్వారా మీ నియోజకవర్గ ప్రజలకు చెప్పదలచుకున్నాను. దేశంలోని కుటుంబాలు, ముఖ్యంగా వృద్ధులకు గత 5-6 దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో తాము ఎదుర్కొన్న కష్టాలు గుర్తుండే ఉంటాయి. అయితే గత 10 పదేళ్ల ఎన్డీయే పాలనలో సమాజంలోని అన్ని వర్గాల జీవన నాణ్యత మెరుగైంది. సమస్యలు చాలా ...

Read More »

బీజేపీలో చేరిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై

ఇటీవల తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్ తిరిగి ఈ రోజు బీజేపీలో చేరారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమలై సారధ్యంలో.. ఆమె బీజేపీ కండువా కప్పుకొని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. కాగా తమిళిసై గతంలో తమిళనాడు బీజేపీ చీఫ్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆమె గత 20 సంవత్సరాలుగా బీజేపీ నాయకురాలిగానే కొనసాగుతున్నారు.

Read More »

కాంగ్రెస్, వైసీపీ ఒక్కటేనని ప్రధాని మోదీ చెప్పగానే జనం నమ్ముతారా?: సజ్జల

పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద నిన్న ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ హాజరైన ప్రజాగళం సభపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. పొత్తు కోసం వెంపర్లాడేది వీళ్లే… ఆ తర్వాత విడిపోయేదీ వీళ్లే… వీళ్లకు ఇదే పని అంటూ ఎద్దేవా చేశారు. 2014లో ఒకసారి కలిశారు… మళ్లీ ఇప్పుడు 2024లో కలిశారు… ఏ ముఖం పెట్టుకుని ముగ్గురూ ఒక వేదికపైకి వచ్చారు? అని ప్రశ్నించారు. ఆనాడు విడాకులు తీసుకుని ఒకరినొకరు తిట్టుకున్నారు… ముఖ్యంగా ప్రధాని మోదీని చంద్రబాబు ...

Read More »

పసుపు ధరపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

పసుపు ధరపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో బీజేపీ తలపెట్టిన విజయసంకల్ప సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. తాము రూ.6,400 కోట్లతో రామగుండం ఎరువులు ఫ్యాక్టరీని పునరుద్ధరించామని తెలిపారు. పసుపు రైతులను బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. పసుపు ధరను క్వింటాల్ కు రూ.6వేల నుంచి రూ.30 వేలకు పెంచామన్నారు. ఇక్కడి ప్రభుత్వాలు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేకపోయాయన్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే వచ్చే పదేళ్ల తెలంగాణ ప్రగతిపై ఫోకస్ చేస్తామన్నారు. తెలంగాణలో రైలు, రోడ్డు మార్గాలను అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణలో ...

Read More »

నేడు హైదరాబాద్ లో మోదీ రోడ్ షో.. భారీ ఆంక్షలు

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల సందడి నెలకొంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. వీలైనన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకునే లక్ష్యంతో బీజేపీ హైకమాండ్ ముందుకు సాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు పర్యటించారు. తాజాగా మరో రెండు రోజుల పర్యటన కోసం మోదీ ఈరోజు హైదరాబాద్ కు విచ్చేస్తున్నారు. ఈరోజు ఆయన మల్కాజ్ గిరి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తారు. సుమారు 5 కిలోమీటర్ల మేర రోడ్ షో జరగనుంది. ...

Read More »

సికింద్రాబాద్-విశాఖ మధ్య .. రెండో వందే భారత్ రైలును ప్రారంభించిన మోదీ

సికింద్రాబాద్ – విశాఖ మధ్య రెండో వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రధాని మోదీ వర్చువల్ గా రైలును ప్రారంభించగా… సికింద్రాబాద్ ప్లాట్ ఫామ్ నెంబర్ 10పై వందే భారత్ రైలుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు పచ్చ జెండా ఊపారు. ఈ నెల 12న ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. వారానికి ఆరు రోజుల పాటు ఈ రైలు రెండు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టనుంది. గురువారం నాడు ఈ రైలు నడవదు. వరంగల్, ఖమ్మం, విజయవాడ, ...

Read More »

అన్నవరం అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్ శంకుస్థాపన

దేశవ్యాప్తంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో హిందూ దేవాలయాలను అభివృద్ధి పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంను మరింత అభివృద్ధి పరిచేందుకు కేటాయించిన రూ.20 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. కొండపైన వార్షిక కళ్యాణ వేదిక ఎదురుగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో దేవస్థానం చైర్మన్ రోహిత్, ఈవో రామచంద్ర మోహన్, కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాధ్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ...

Read More »

ముగిసిన ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన… 11 విజ్ఞప్తులతో లేఖ ఇచ్చిన రేవంత్ రెడ్డి

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ముగిసింది. రెండు రోజుల పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్, సంగారెడ్డి బీజేపీ విజయ సంకల్ప సభలలో పాల్గొన్నారు. నిన్న ఉదయం తెలంగాణలో పర్యటన అనంతరం మధ్యాహ్నం తమిళనాడు సభలో పాల్గొన్నారు. రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకున్న ప్రధాని… రాజ్ భవన్‌లో బస చేశారు. ఉదయం తెలంగాణలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పటేల్‌గూడ సభ అనంతరం హైదరాబాద్ చేరుకొని అక్కడి నుంచి బేగంపేట విమానాశ్రయం నుంచి ఒడిశాకు బయలుదేరారు. వీడ్కోలు సందర్భంగా ప్రధాని ...

Read More »

బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకే జాతి పక్షులే..!

ప్రధాని నరేంద్ర మోదీ నేడు తెలంగాణలో పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పటాన్ చెరులో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభకు హాజరయ్యారు. ఈ సభలో మోదీ ప్రసంగిస్తూ… తెలంగాణలో బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోందని వెల్లడించారు. తాము మోదీ కుటుంబ సభ్యులమని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని వివరించారు. మీ కలలే నా సంకల్పం… అని స్పష్టం చేశారు. 140 కోట్ల మంది భారతీయులే తన కుటుంబం అని ప్రధాని మోదీ తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకే జాతి పక్షులు అని విమర్శించారు. బీఆర్ఎస్, ...

Read More »