Tag Archives: bjp

హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ.. అరగంట పాటు చర్చలు

హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ.. అరగంట పాటు చర్చలు

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. దాదాపు అర గంట పాటు వీరి భేటీ కొనసాగింది. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ సమస్యలు, దిశ బిల్లుకు చట్టబద్ధత, మండలి రద్దు సహా పలు అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

Read More »

బీజేపీ ఫైర్ బ్రాండ్ కపిల్ మిశ్రా పరాజయం

బీజేపీ ఫైర్ బ్రాండ్ కపిల్ మిశ్రా పరాజయం

బీజేపీ ఫైర్ బ్రాండ్ కపిల్ మిశ్రా పరాజయం పాలయ్యారు. తన ప్రత్యర్థి అయిన ఆప్ అభ్యర్థి అఖిలేశ్ త్రిపాఠి చేతిలో ఓటమి పాలయ్యారు. ‘‘మేము తిరిగి ప్రజల్లోకి వెళ్లి పనిచేయాలి. బలమైన ప్రతిపక్షంగా కొనసాగుతాం. ఓటమి చెందినందుకు ఏమాత్రం బాధపడటం లేదు. ప్రజల అంచనాలను మేము అందుకోలేకపోయాం. భారీ విజయం సాధించిన కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు’’ అని వ్యాఖ్యానించారు.

Read More »

బిజెపి పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ మనోజ్ ఝా

బిజెపి పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ మనోజ్ ఝా

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి చెంపపెట్టు అని ఆర్జేడీ సీనియర్ నేత, ఎంపీ మనోజ్ ఝా వ్యాఖ్యానించారు. బీజేపీ విషపూరిత ప్రచారం ఢిల్లీ ఎన్నికల్లో పనిచేయలేదని ఇవి నిరూపించాయని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి బిహార్ లో కూడా రానుందని, మరికొన్ని రోజుల్లో దేశమంతటా ఇదే పరిస్థితి రానుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఆర్జేడీ నాలుగు స్థానాల్లో పోటీ చేసింది. తాము ఈ ఫలితాలతో నిరాశ చెందడం లేదని, ప్రజలు తమ తీర్పునిచ్చారని, తాము గౌరవిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Read More »

ఢిల్లీలో మొదలైన ‘ఆప్’ దూకుడు.. 5 స్థానాల్లో ఆధిక్యం

ఢిల్లీలో మొదలైన ‘ఆప్’ దూకుడు.. 5 స్థానాల్లో ఆధిక్యం

న్యూఢిల్లీ, ఢిల్లీ ఉత్తర, దక్షిణ, సెంట్రల్, చాందినీ చౌక్‌ జిల్లాల్లో ఏకపక్ష విజయం దిశగా ఆమ్ అద్మీ పార్టీ కొనసాగుతుండగా, ఈశాన్య, వాయువ్య ఢిల్లీలో బీజేపీ సత్తా చాటుకుంటోంది. చాందినీ చౌక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి అల్కా లంబా వెనుకంజలో ఉన్నారు. వజీర్‌పూర్, బాబర్‌పూర్‌లో ఆప్ ముందంజలో ఉంది. చాందినీ చౌక్‌లోని 10 స్థానాలకు గానూ 9 చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు ముందజలో ఉన్నారు. పత్పార్‌గంజ్‌లో డిప్యూటీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా, మాలవీయ నగర్‌లో ఆప్ అభ్యర్థి ...

Read More »

ఎల్లో మీడియా పై ఫైర్ అయిన విజయసాయి రెడ్డి

ఎల్లో మీడియా పై ఫైర్ అయిన విజయసాయి రెడ్డి

రాజధానిపై వివరణ ఇచ్చినందుకుగాను బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావుపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిపై జోక్యం చేసుకోమని కేంద్రం వెల్లడించినా.. ఎల్లో మీడియా మాత్రం కేంద్రం ఎలాగైనా అడ్డుకోవాలని కోరుకుంటోందని విమర్శించారు.రాజధానిపై కేంద్ర జోక్యం చేసుకోదని పార్లమెంట్‌లో సంబంధిత మంత్రి వెల్లడించారు. అది రాష్ట్రాలకున్న ప్రత్యేక హక్కు. పచ్చ మీడియా మాత్రం కేంద్రం ఎలాగైనా అడ్డుకోవాలని కోరుకుంటుంది. దీనిపై వివరణ ఇచ్చిన బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌పై దుష్ర్పచారానికి ఒడిగట్టడం దారుణం ...

Read More »

ప్రారంభమైన ఢిల్లీ ఎన్నికల పోలింగ్.. ఎన్నడూలేని విధంగా భారీ భద్రత

ప్రారంభమైన ఢిల్లీ ఎన్నికల పోలింగ్.. ఎన్నడూలేని విధంగా భారీ భద్రత

ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యింది. మొతత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలోనే పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 1.5 కోట్ల మంది ఓటర్ల తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, అత్యధికంగా పురుష ఓటర్లు 81,05,236 మంది, మహిళా ఓటర్లు 66,80,277 మంది ఉన్నారు. అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ సహా వివిధ పార్టీలకు చెందిన 672 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరంతా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఢిల్లీ ఎన్నికల కోసం భారీగా ...

Read More »

నేటితో ముగియనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

నేటితో ముగియనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వం ముగియనుంది. ఈ నెల 8న ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. గత మూడు వారాలుగా ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. సాయంత్రం ఆరు గంటల అనంతరం ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ప్రచారంతో పాటు మద్యం దుకాణాలు కూడా బంద్ కానున్నాయి. కాగా ఈనెల 11న కౌంటింగ్‌ పూర్తి చేసి, అదే రోజున ఈసీ తుది ఫలితాలు ...

Read More »