అదే నిజమైతే ఎమ్మెల్సీ కవిత జైల్లో ఉంటుందా?: కేటీఆర్

ktr11.jpg

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అయితే తన సోదరి కవిత జైల్లో ఉంటుందా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కుషాయిగూడలో ఆయన మైనార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ… మనుషుల మనసుల్లో విషం నింపి ప్రధాని మోదీ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీని ఎదుర్కొనే శక్తి ప్రాంతీయ పార్టీలకు… నేతలకే ఉందన్నారు. మైనార్టీల కోసం కేసీఆర్ ఎంతో చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే అన్నారు.

మైనార్టీల కోసం కేసీఆర్ స్కూల్స్ ప్రారంభించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేసినప్పుడల్లా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్మి ప్రజలు బీఆర్ఎస్‌ను ఓడించారని… కానీ హామీలు అమలు కాలేదన్నారు.

Share this post

scroll to top