ఎండాకాలంలో వానలు ఎందుకు పడుతాయి?

Raining.jpg

సమ్మర్‌లో కూడా ఒక్కోసారి అధిక గాలితో కుండపోత వానలు కురుస్తాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంటుంది. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఎందుకు ఇలా మండే ఎండల్లో వర్షం పడుతుంది. దీనికి గల కారణం ఏమిటని? దక్కన్ పీఠభూమి ప్రాంతం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా కొన్ని ప్రాంతాలలో సమ్మర్‌లో వర్షాలు పడుతాయంట. అలాగే మఠ్వాడ ప్రాంతం సమీపంలో ఉండటం వలన క్యుమలోనింబస్ మేఘాలు ఏర్పటి వాటి వలన ఎండాకాలంలో కూడా వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. అంతే కాకుండా, వర్షాపాతంలో కూడా రకాలు ఉంటాయంట. అందులో ఉష్ణప్రసరణ వర్షపాతం ఒకటి. ఇది మండే ఎండాకాలంలో పడుతుంటుంది.

వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉండటం వలన వాతావరణంలోని గాలి ఉష్ణోగ్రత పెరిగి తేలిక అవుతుంది. దీంతో అది చాలా ఎత్తుకి వెళ్తూ.. నీటి బిందువులు తయారు అవుతాయి. దీనిని మోల్ అని కూడా అంటారు. ఇలా ఒక్కో నీటి బిందువు తయారై ఉష్ణం విడుదల కావడం వలన మబ్బు ఉష్ణోగ్రత పెరిగి, నీటి బిందువులు వర్షంలా కింద పడుతాయంట. దీని కారణంగా సమ్మర్‌లో వర్షం పడుతుంది. దీనికి దట్టమైన మేఘాలు రావాల్సిన అవసరం లేదు.. మబ్బు ఎక్కువగా లేకపోయినా ఈ వర్షం పడుతుందంటున్నారు కొందరు నిపుణులు.

Share this post

scroll to top