షర్మిలపై కేసు నమోదు..

sarmilla.jpg

కాంగ్రెస్ పార్టీ ఎపి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలపై వైఎస్సార్ జిల్లాలో పోలీస్ కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలను అతిక్రమించారని ఫిర్యాదు అందడంతో షర్మిలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నెల 2న బద్వేల్ లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ ఈ సభలో పాల్గొన్న షర్మిల.. తన ప్రసంగంలో వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూ పలు కామెంట్లు చేశారు.

అయితే, ఎన్నికల సమయంలో వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావించ వద్దని, ఈ కేసుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు రాజకీయ నేతలను హెచ్చరించింది. బహిరంగ సభలో వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావించడం ద్వారా షర్మిల కోర్టు ఆదేశాలను ధిక్కరించారని బద్వేల్ నోడల్ అధికారి, బద్వేల్ మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా షర్మిలపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Share this post

scroll to top