ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజిగిరి బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తరపున నిర్వహించే సభల్లో పాల్గొననున్నారు. మొదట ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని ధర్మవరంలో ఎన్నికల ప్రచారం చేస్తారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి మధ్యాహ్నాం 1:50 గంటలకు చేరుకుంటారు.
బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు మధ్యాహ్నాం 3:05 గంటలకు చేరుకోని.. ఆదిలాబాద్ కమలం పార్టీ లోక్‌సభ అభ్యర్థి గోడెం నగేష్‌కు మద్దతుగా ఎస్పీఎం క్రికెట్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. మధ్యాహ్నాం 3:20 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 40 నిమిషాల పాటు సభలో ఉంటారు.