ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై విపక్షాలు దుష్పచారం చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. ‘ఈ చట్టం ఇంకా రూపకల్పన దశలోనే ఉంది. ఇంకా గెజిట్ రాలేదు.. విధివిధానాలు ఖరారు కాలేదు. అక్రమాలకు చెక్ పెట్టే విధంగా ఈ యాక్ట్ ఉంటుంది. సమగ్ర భూసర్వే పూర్తయిన తర్వాతే అమల్లోకి వస్తుంది. భూ కబ్జాలు చేసే చంద్రబాబు లాంటి వాళ్లకు ఇలాంటి చట్టాలు రావడం ఇష్టం ఉండదు’ అని ఫైర్ అయ్యారు.