లక్నోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత..

WhatsApp-Image-2024-05-11-at-10.41.44.jpeg

భవిష్యత్ కాలంలో కాంగ్రెస్ పార్టీ తన రాజకీయాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కూడా తప్పులు చేసిందని, పార్టీలో మార్పు జరగాలని, కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా ఈ మాట చెబుతున్నానని ఆయన అన్నారు. లక్నోలో సంవిధాన్ సమ్మేళన్ అనే కార్యక్రమంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇక ప్రధాని నరేంద్ర మోదీ ఒక చక్రవర్తి అని, ఆయన ప్రధాని కాదని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఇద్దరు ముగ్గురు ఫైనాన్షియర్ల కోసం మాత్రమే మోదీ పనిచేస్తారని ఆరోపించారు. ఫైనాన్షియర్ల కోసమే మోదీ ఫ్రంట్ పనిచేస్తుందని అన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీ 180 సీట్ల లోపే పరిమితం అవుతుందని అభిప్రాయపడ్డారు. నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కాలేరని, కావాలంటే లిఖితపూర్వకంగా రాసిస్తానని అన్నారు.

Share this post

scroll to top