అసెంబ్లీ పోలింగ్‌కి మరొక్క రోజే సమయం.. ఏపీకి కదిలిన ఓటర్లు..

WhatsApp-Image-2024-05-11-at-10.54.37.jpeg

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు ఇంకా రోజు మాత్రమే మిగిలివుంది. నేటితో ప్రచారం ముగియనుండగా.. ఎల్లుండి సోమవారం ఓటింగ్ జరగనుంది. దీంతో ఏపీ వాసులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వస్థలాలకు తరలివెళ్తున్నారు. ముఖ్యంగా భాగ్యనగరం నుంచి పెద్ద సంఖ్యలో కదలి వెళ్తున్నారు.దీంతో శుక్రవారం రాత్రి నుంచి హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లేవారి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో రోడ్లన్నీ రద్దీగా మారిపోయాయి.

సొంత వాహనాల్లో వెళ్లేవారి సంఖ్య అధికంగా ఉండడంతో హైదరాబాద్‌- విజయవాడ హైవేపై ఒక్కసారిగా భారీ రద్దీ పెరిగిపోయింది. పలుచోట్ల ట్రాఫిక్‌జాములు అవుతున్నాయి. శనివారం వేకువజాము నుంచి ఈ పరిస్థితి మరింత ఎక్కువగా కనిపిస్తోంది.

Share this post

scroll to top