నోట్ల రద్దు విఫల ప్రయత్నమని మోదీ భావిస్తున్నారా?

KTR-1.jpg

ఇటీవలి సభలో మోదీ మాట్లాడిన ప్రకారం, కాంగ్రెస్ పార్టీకి అదానీ, అంబానీలు టెంపోల నిండుగా డబ్బులు పంపిస్తుంటే, ప్రధానికి ఇష్టమైన సీబీఐ, ఈడీ, ఐటీ ఎందుకు మౌనంగా ఉన్నాయి? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నిన్న వేములవాడలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ ఈ అంశంపై మాట్లాడారని పేర్కొన్నారు.

ఈ సభలో మోదీ మాట్లాడుతూ, ‘తెలంగాణ గడ్డ నుంచి నేను ఒకటి అడగాలనుకుంటున్నా. గడచిన ఐదేళ్లుగా అదానీ, అంబానీలపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్‌.. ఎన్నికల ప్రక్రియ మొదలు కాగానే ఎందుకు మౌనం దాల్చిందో స్పష్టం చేయాలి. అదానీ, అంబానీ నుంచి ఎన్ని టెంపో లోడ్ల ధనం ముట్టింది? ఏం ఒప్పందం కుదిరింది? రాత్రికి రాత్రే అంబానీ, అదానీలపై ఆరోపణలు ఆగిపోయాయి’ అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. దీనిని కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రస్తావించారు. నోట్ల రద్దు విఫల ప్రయత్నమని ప్రధాని మోదీ భావిస్తున్నారా? అన్నారు.

Share this post

scroll to top