టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. బెంగళూరు రేవ్ పార్టీ అంశంలో సోమిరెడ్డి చేసిన ఆరోపణలపై కాకాణి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. నీ బ్లడ్ శాంపిల్, నా బ్లడ్ శాంపిల్ ఇద్దాం రా అన్నారు. ఎవరు తాగుతారో.. డ్రగ్స్ తీసుకుంటారో తేలిపోతుందన్నారు. తన పాస్ పోర్టు కారులో లభ్యమైందని చెప్పారని.. ఇదిగో నా పాస్ పోర్టు చూడండి అంటూ చూయించారు.
అక్కడ ఉన్నది తన కారే అని నిరూపిస్తావా అంటావా కాకాణి సవాల్ విసిరారు. తన పాస్ పోర్టు రేవ్ పార్టీ వద్ద ఉన్న కారులో దొరికింది అంటే రుజువులు చూపించాలని డిమాండ్ చేశారు. కారు విజయవాడకు చెందిన తుమ్మల వెంకటేశ్వరరావుది అన్నారు. ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డి ఎవరో తనకు తెలియదన్నారు.