హైదరాబాద్ వర్షం దంచికొట్టడంతో అలర్ట్‌గా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. కాగా, హైదరాబాద్‌లో కుండ పోత వర్షం పడటంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌తో పాటు వర్షం పడుతున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ సూచించారు. సచివాలయం నుంచి అన్ని విభాగాల అధికారులతో సీఎం మాట్లాడారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.