వైసీపీ కార్యకర్తలపై దాడి చేస్తే..నాకు ఫోన్‌ చేయండి – రాజన్న దొర

ysrcp1.jpg

వైసీపీ కార్యకర్తలపై దాడి చేస్తే..నాకు ఫోన్‌ చేయండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాజన్న దొర. పార్వతీపురం మన్యం జిల్లా..సాలూరు మున్సిపాలిటీలో రాజన్న దొర ఇంటింటికి ప్రచారం కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాజన్న దొర మాట్లాడుతూ…. వైఎస్సార్సీపి కార్యకర్తపై టిడిపి చెందిన వ్యక్తులు కొందరు దాడి చేశారని తెలుసుకున్నానని తెలిపారు.

వైయస్సార్ కార్యకర్తలపై దాడులు చేసిన, భయపెట్టిన, బెదిరించిన, ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు రాజన్నదొర. నన్నే బెదిరించేందుకు చూస్తారు.. భయపెడితే భయపడటానికి నేను పట్టణాల్లో పుట్టిన వ్యక్తిని కాదు మారుమూల గిరిజన గూడాలో పెరిగిన వ్యక్తిని…అంటూ పేర్కొన్నారు రాజన్న దొర. ఎవరైనా వైయస్సార్ కార్యకర్తలపై దాడి జరిగితే నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. తక్షణమే అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. నేనే ప్రత్యక్షంగా రంగంలో దిగుతానని రాజన్న దొర స్పష్టం చేశారు.

Share this post

scroll to top