ఇవి దగ్గర ఉంచుకోండి: కేటీఆర్

ktr12.jpg

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆరు వస్తువులను ప్రతి ఒక్కరు సమకూర్చుకోవాలని ఆయన చెప్పారు. ఇన్వర్టర్, ఛార్జింగ్ బల్బులు, టార్చ్ లైట్లు, క్యాండిల్స్, జనరేటర్స్, పవర్ బ్యాంక్స్ లను దగ్గర పెట్టుకోవాలని సూచించారు. సిక్స్ గ్యారంటీస్ అని ఎద్దేవా చేశారు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు… కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. మే 13వ తేదీన ప్రజలంతా తెలివిగా ఓటు వేయాలని సూచించారు. ఓట్ ఫర్ కార్, కేసీఆర్ ఫర్ తెలంగాణ అనే హ్యాష్ ట్యాగ్ లను తన కామెంట్ కు జత చేశారు.

Share this post

scroll to top