‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వసూళ్లకంటే ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూళ్లు మించిపోయాయి: మోదీ

modi3.jpg

తెలంగాణలో మార్పు తీసుకొస్తామంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ.. అవినీతిలో గత ప్రభుత్వాన్నే అనుసరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా వసూళ్లకంటే రాష్ట్రంలో ‘ఆర్ఆర్’ ట్యాక్స్ వసూళ్లే మించిపోయాయని ఆరోపించారు. కాంగ్రెస్ తీరుపై దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహం నెలకొందని చెప్పారు. ప్రజలు తమ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపెడుతున్నారని, ఇప్పటి వరకు జరిగిన మూడు దశల లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరాభవమే ఎదురైందని చెప్పారు. మిగతా నాలుగు దశలలోనూ ఆ పార్టీకి ఓట్లు రాలవని చెప్పారు.

బీజేపీ, ఎన్డీయే కూటమిని గెలిపించుకోవాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని చెప్పారు. కరీంనగర్‌ లో బండి సంజయ్‌ గెలుపు ఖరారైందని చెప్పారు. ఈమేరకు బుధవారం వేములవాడలో బీజేపీ ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. బుధవారం ఉదయమే వేములవాడ చేరుకున్న ప్రధాని.. ముందుగా రాజరాజేశ్వరుడిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి, కోడె మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి భారీగా వచ్చిన జనం ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు.

Share this post

scroll to top