మరో 9 రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయని, ఇవి పేదల భవిష్యత్తును నిర్ణయిస్తాయని సీఎం జగన్ తెలిపారు. నెల్లూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విలువలు, విశ్వసనీయత మధ్య కురక్షేత్రం జరుగుతోందని, ఓటేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని జగన్ పిలుపునిచ్చారు. తాము ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని కోరారు. ఎక్కడా లంచాలు, వివక్షకు తావులేకుండా పాలన చేశామని చెప్పారు. రూ. 2 లక్షల 70 వేల కోట్లు డైరెక్ట్‌గా లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేశామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు.