చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్‌

jagan5.jpg

ఈ ఎన్నికలు.. ఐదేళ్ల భవిష్యత్‌.. జగన్‌కు ఓటేస్తే.. పథకాలు కొనసాగింపు.. పొరపాటున బాబుకు ఓటేస్తే.. పథకాలు ముగింపేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం మధ్యాహ్నం పలమనేరు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతుందన్నారు.

‘‘పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే.. కొండచిలువ నోట్లో తలపెట్టినట్లే. చంద్రబాబును నమ్మితే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. రూ.2 లక్షల 70వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం. లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమం అందించాం. 59 నెలల్లోనే 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చాం. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం. పిల్లల చదువులు కోసం అమ్మఒడితో ప్రోత్సహిస్తున్నాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం తీసుకొచ్చాం. మహిళల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావించాం’’ అని సీఎం జగన్‌ చెప్పారు

Share this post

scroll to top