విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..

Vijayyy-rowdy-boy.jpg

ఇటీవలే ‘ఫ్యామిలీ స్టార్‌’ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్. మరో కొత్త సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. రవికిరణ్‌ కోలా డైరెక్షన్‌లో పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ విషయాన్ని డైరెక్టర్ రవి కిరణ్ స్వయంగా వెల్లడించాడు. రెండవ సినిమా కావడంతో కొంచెం సమయం తీసుకొని చేస్తున్నానని ఆయన తెలిపారు.

పొలిటికల్ డ్రామా కావడంతో ఎక్కువ స్టడీ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఏ పాయింట్ చెప్పినా ఏదో ఇచ్చాం అన్నట్టు కాకుండా పర్‌ఫెక్ట్‌గా చెప్పాలని నిర్ణయించుకున్నానని రవికిరణ్‌ కోలా వివరించారు. చూసే వాళ్లకు సిల్లీగా అనిపించకుండా గొప్పగా అనిపించాలనే ఉద్దేశంతో ఎక్కువ టైమ్ తీసుకొని రాశానని, చాలా బాగా వచ్చిందని వెల్లడించారు. కాగా ఈ సినిమాను నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్‌రాజు నిర్మించనున్నారు. డైరెక్టర్ రవికిరణ్ కోలా తొలి సినిమా‘రాజావారు రాణిగారు’తోనే హిట్ అందుకున్నారు.

Share this post

scroll to top