హ్యాపీ బర్త్‌డే ఫిదా బ్యూటీ..

Fidhaaa.jpg

అందాల ముద్దుగుమ్మ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ ప్రేమమ్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. తర్వాత వచ్చిండే.. మెల్ల మెల్లగ వచ్చిండే అంటూ తన డ్యాన్స్‌తో ప్రతి ఒక్కరి మదిలో అందాల యువరాణి గా నిలిచి పోయింది.

ఈ అందాల ముద్దుగుమ్మ సాయిపల్లవి పుట్టిన రోజు. ఈ బ్యూటీ 1992లో జన్మించింది. ఆమెది తమిళ కుటుంబం. ఈ బ్యూటీ మాతృభాష బడగ. ఇక సాయిపల్లవి తెలుగులో చాలా సినిమాల్లోనే నటించింది. ఈ బ్యూటీ రొమాంటిక్ సీన్స్‌కు దూరంగా ఉంటుంది. గ్లామర్ పాత్రలు చేయడానికి అంతగా ఇష్టం చూపదు. అందుకే ఈ నటి అంటే చాలా మందికి ఇష్టం. మరీ ముఖ్యం సాయిపల్లవి డ్యాన్స్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఈమె డ్యాన్స్ చేస్తే.. నెమలి నాట్యం చేసినట్లు ఉందని చెబుతుంటారు. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం నాగచైతన్య హీరోగా వస్తున్న తండేల్ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ బ్యూటీకి చైతూ‌తో పాటు పలువురు బర్త్‌డే విషెస్ చెబుతున్నారు.

Share this post

scroll to top