‘దేవర’ రిలీజ్ డేట్ లాక్.. ఎన్టీఆర్ సినిమా వచ్చేది అప్పుడే

Devraaaaaaaaaaa.jpg

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘దేవర’. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకోగా.. మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే.. ప్రస్తుతం అందుకున్న సమాచారం మేరకు ‘దేవర’ రిలీజ్ డేట్ చేంజ్ అయింది. నిజానికి ఈ సినిమాను ముందుగా అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ డేట్ చేంజ్ చేసినట్లు తెలుస్తోంది. Devara NTR అనే అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ ‘‘దేవర’ రిలీజ్ డేట్ లాక్. 27 సెప్టెంబర్ 2024న రిలీజ్ కానుంది’ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కాగా.. అనుకున్నదాని కంటే ముందే ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాబోతుందా అంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Share this post

scroll to top