యంగ్ బ్యూటీ శోభిత ధూళిపాళ అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు భాషలతో సంబంధం లేకుండా టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇటీవల శోభిత నటించిన మంకీ మాన్ మంచి విజయం సాధించింది. అలాగే పలు యాడ్స్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పోస్టులు షేర్ చేస్తుంది. అయితే గత కొద్ది కాలంగా శోభిత, అక్కినేని నాగచైతన్యతో డేటింగ్‌లో ఉన్నట్లు పలు పుకార్లు షికారు చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే వీరిద్దరు కలిసి లండన్‌లో ఓ రెస్టారెంట్‌లో కనిపించడంతో డేటింగ్ వార్తలు జోరందుకున్నాయి. ముఖ్యంగా ఇటీవల శోభిత షేర్ చేసిన పోస్ట్‌లో chai అని రాయడంతో వీరి రిలేషన్ కన్ఫామ్ అని అంతా ఫిక్స్ అయిపోయారు. వీరిద్దరు తొందరలో పెళ్లి కూడా చేసుకుంటారని అంతా భావించారు. అలాగే శోభిత, చై రిలేషన్ గురించి పలు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే శోభిత కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ ఆసక్తికర క్యాప్షన్ జత చేసింది. ఓ చిన్న పాపను ఎత్తుకుని ఉన్న ఫొటోలు షేర్ చేస్తూ ‘‘బుజ్జి బంగారం. తార మిట్స్ తార’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా అది చూసిన కొందరు నెటిజన్లు ఆ పాప అచ్చం నీలాగే ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.