ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో..ఇది కాదా అభిమానులకు కావాల్సింది

Legends.jpg

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. ‘కౌన్ బనేగా కరోడ్పతి’ షోతో పాటు సినిమాల షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నాడు ఈ స్టార్ నటుడు. బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగులో కల్కి సినిమాలోనూ నటిస్తున్నారు అమితాబ్ ఈ సినిమాలో ఆయన అశ్వథామ అనే పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే అమితాబ్ కు సంబందించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇదిలా ఉంటే అమితాబ్ ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి నటించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం రజినికాంత్ ‘ వేట్టైయాన్ ‘ అనే సినిమా షూటింగ్‌లో బిజీగా రజినీకాంత్. ఈ సినిమాలో చాలా మంది సెలబ్రెటీలు నటిస్తున్నారు. అమితాబ్ కూడా రజనీకాంత్‌తో స్క్రీన్‌ను పంచుకోనున్నారు.

తమిళలో తెరక్కెక్కుతోన్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా అమితాబ్, రజినీకాంత్ కలిసి ఉన్నకొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రజనీకాంత్ , అమితాబ్ ఇద్దరూ చాలా స్టైలిష్ గా కనిపించారు. చాలా మంది ఈ ఫోటోకు హార్ట్ ఎమోజీని కామెంట్ చేస్తుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం అనౌన్స్ చేసింది. ఈ ఏడాది అక్టోబ‌ర్ నెల‌లో సినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు టాక్ వినిపిస్తుంది. రజనీ, అమితాబ్‌ కాంబినేషన్‌లో ఈ సినిమా ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

Share this post

scroll to top