అందాల చందమామ కాజల్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. అందానికి పెట్టింది పేరు ఈ ముద్దుగుమ్మ. లక్ష్మీ కళ్యాణ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ, మగధీర సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది.
తాజాగా ఆలీతో సరదాగా అనే షోలో పాల్గొన్న ఈ బ్యూటీ తన ప్రేమ, పెళ్లి, కెరీర్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సత్యభామ ప్రమోషన్స్‌లో భాగంగా కాజల్ ఆలితో సరదగా అనే కార్యక్రమానికి గెస్ట్‌గా వచ్చింది. అందులో ఆలీ పెళ్లి తర్వాత లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గౌతమ్ ఏమైనా రూల్ పెట్టాడా అని అడగ్గా.. అలాంటిది ఏమి లేదు. నేను చాలా రోజుల నుంచి యాక్షన్ తరహాల విలన్స్‌ను కొట్టే పాత్రలు చేయాలని అనుకుంటున్నాను.. అందులో భాగంగానే సత్యభామను ఓకే చేశాను అంటూ చెప్పుకొచ్చింది. అలాగే జనతా గ్యారేజ్‌లో ఐటెం సాంగ్ చేయడానికి కారణం ఏమిటని ప్రశ్నించగా..బ్యానర్, పెద్ద డైరెక్టర్, రెమ్యునరేషన్ గురించి ఆలోచించి ఐటెంసాంగ్ చేయలేదని, కేవలం తారక్ కోసమే ఆ ఐటమ్ సాంగ్ చేశానంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కాజల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.