మ్యారేజ్ చేసుకునే ఉద్దేశ్యం లేదు.. కానీ పిల్లలు కావాలి..

Faria-abdullah.jpg

యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా ‘జాతిరత్నాలు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ‘ఆ ఒక్కటి అడక్కు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్సిడ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరియా తనకు పెళ్లిపై హోప్ లేదు కానీ.. పిల్లలు మాత్రం కావాలంటూ చెప్పుకొచ్చింది.

‘నా మ్యారేజ్ పైన నాకు హోప్ కూడా లేదు. ఒకవేళ అయితే అవ్వోచ్చు. కానీ కచ్చితంగా నేను పెళ్లి చేసుకోవాలి అని అయితే నాకు లేదు. కానీ నాకు పిల్లలు అంటే మాత్రం చాలా ఇష్టం. కాబట్టి అమ్మ అవుతాను. కానీ పెళ్లి గురించి మాత్రం ఆలోచించాలి. దేవుడు మనకు ఓ సూపర్ పవర్ ఇచ్చాడు. మనం ఎంత మందిని కావాలంటే అందరిని ప్రోడ్యూస్ చెయ్యెచ్చు. అయితే తండ్రి బాధ్యతలు కూడా ఉండాలి. ఒక చైల్డ్‌ని తల్లీతండ్రి ఇద్దరు కలిసే పెంచాలి. దాంట్లో నాకు డౌట్ లేదు. కానీ మ్యారేజ్ కాన్సెప్ట్ అంటేనే నాకు కొంచెం భయం’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఫరియా కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Share this post

scroll to top