ఓటీటీలోకి ఆదా శర్మ వివాదాస్పద మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడ..

Adhar-sharmaaa.jpg

యంగ్ బ్యూటీ ఆదా శర్మ అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ది కేరళ స్టోరీ సినిమాతో ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. ఈ చిత్రం విడుదలకు ముందే పలు వివాదాలు ఎదుర్కొన్నప్పటికీ.. థియేటర్స్‌లోకి వచ్చాక అందరి చేత ప్రశంసలు అందుకుంది. అయితే అదే ఫామ్‌తో దూసుకుపోతున్న ఆదాశర్మ ఇటీవల మరో కాంట్రవర్షియల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది. సుదీప్తో సేన్ ‘బస్తర్ ది నక్సల్ స్టోరీ’ సినిమాను తెరకెక్కించాడు.

అయితే ఈ చిత్రం కూడా పలు వివాదాలు నేపథ్యంలో మార్చి 15న థియేటర్స్‌లో విడుదలైంది. అలాగే ప్రేక్షకులను మెప్పించడంతో పాటు కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. తాజాగా, బస్తర్ ది నక్సల్ స్టోరీ డిజిటల్ స్ట్రీమింగ్‌గా రెడీ అయింది. ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ జీ5 సొంతం చేసుకున్నట్లు సమాచారం. మే 17న ఈ సినిమా స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుందని జీ5 అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దీంతో ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Share this post

scroll to top