డయాబెటిస్‌ రోగులకు దివ్యాస్త్రం ఈ పండు..

Gooseberry.jpg

ఉసిరిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, ఫైబర్, ఫోలేట్, ఫాస్పరస్, పిండి పదార్థాలు, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. కావున మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉసిరి మన శరీరానికి అనేక రకాల పోషకాలను అందించి.. ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.. ఉసిరి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో చాలా సహాయపడతాయి.

ఉసిరికాయను మెత్తగా నూరి దాని రసాన్ని తీసి అందులో కాస్త నల్ల ఉప్పు కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే మేలు జరుగుతుంది.ఉడకబెట్టిన ఉసిరిలో పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, పుదీనా ఆకులు, రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసి చట్నీ తయారు చేసుకోవాలి. మీరు రోజులో ఎప్పుడైనా మీ భోజనంతో పాటు హాయిగా తినవచ్చు. ఇది జీర్ణక్రియకు కూడా చాలా మేలు చేస్తుంది.

Share this post

scroll to top