Wifi లేక మెంటల్ మెంటల్ చేస్తున్న టీనేజర్స్..

Wifiiii.jpg

ప్రస్తుతం అందరి చేతిలో మొబైల్ ఉంటుంది. వృద్ధుల నుంచి నాలుగు ఐదు నెలల పిల్లలు కూడా ఫోన్ చూసేందుకే ఇష్టపడుతున్నారు. అలాంటప్పుడు డేటా కచ్చితంగా అవసరం. లేదంటే ఏమీ పాలుపోని పరిస్థితి తలెత్తుతుంది. అందుకే ఈ బాధ లేకుండా ఇంట్లో కూడా wifi పెట్టించుకుని నాన్ స్టాప్ గా ఎంజాయ్ చేస్తుంటారు. కాగా ఈ విషయంపై సర్వే చేపట్టిన శాస్త్రవేత్తలు.. wifi ఉంటే ఇల్లు ప్రశాంతతకు నిలయంగా ఉంటుందని గుర్తించారు. దాదాపు 57శాతం మంది ఇందుకే ఓటు వేస్తున్నారని తెలిపారు.

ఇంటర్నెట్ కనెక్షన్ మూడ్ అప్ చేసి హ్యాపీగా ఉంచుతుందని తెలిపింది సర్వే. ముఖ్యంగా టీనేజర్స్ ఇందుకు చాలా అలవాటు పడిపోయారని.. లేకుండా ఉంటే మెంటల్ మెంటల్ బిహేవ్ చేస్తున్నారని తేలింది. అయితే మరోవైపు దీనివల్ల నష్టాలు కూడా ఉన్నాయని గత అధ్యయనాల్లో తేలింది. భార్యాభర్తల మధ్య బంధాన్ని విడదీయడంలో కీలకపాత్ర పోషిస్తుందని ఫలితాల్లో వెలువడింది. కాగా దీనిపై స్పందిస్తున్న నిపుణులు.. మన జీవితాల్లో బంధాలతోపాటు టెక్నాలజీని బ్యాలెన్స్ చేయాలని సూచిస్తున్నారు. లేదంటే లైఫ్ లో చాలా మిస్ అవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Share this post

scroll to top