చాలామంది మంచి ఫిట్ బాడీ కోసం అతిగా కష్టపడుతూ వ్యాయామం చేస్తుంటారు. కానీ అలా చేయడం మీ ఆరోగ్యానికి మంచిది అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. అధిక వ్యాయామం చేయడం వలన ఎముకలను బలహీనపరుస్తుందట. అంతే కాదు శరీరంలోని కాల్షియం మొత్తాన్ని తగ్గిస్తుందట. అలాగే రోగనిరోధక శక్తి పై కూడా ప్రతికూల ప్రభావాలు చూపిస్తుందట. అందుకే ఈ రోజు మనం ఓవర్‌ట్రైనింగ్ లేదా అధిక వ్యాయామం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.
ఒత్తిడి, పగుళ్లు..
అధిక వ్యాయామం ఎముకల పై స్థిరమైన ఒత్తిడిని కలిగిస్తుందంటున్నారు నిపుణులు. ఈ ఒత్తిడి ఎముకల పగుళ్లకు దారితీస్తుంది. అంటే చాలా చిన్న పగుళ్లు, ఇది తీవ్రమైన గాయాలుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయట.
కాల్షియం లోపం..
అధిక వ్యాయామం వల్ల శరీరంలో కాల్షియం లోపం ఏర్పడుతుందంటున్నారు నిపుణులు. కాల్షియం బలమైన ఎముకలకు అవసరం. ఇది ఎముకల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.