ఏపీలో జగన్‌దే విజయం..అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ambatai-ramababu-.jpg

ఏపీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో సార్వత్రిక పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఇక ఏపీలో గెలుపు ఓటములపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమిలో 4వ పార్ట్‌నర్‌గా పోలింగ్ రోజున ఏపీ పోలీస్ చేరి ఫైట్ చేసిన జగన్ అన్నదే విజయం అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో టీడీపీ పై నిప్పులు చెరిగారు. పోలీసులతో టీడీపీ కుమ్మక్కైందని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. రాష్ట్రంలో జరిగిన దాడులు, హింసాత్మక ఘటనలపై ఆయన డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఫిర్యాదు చేశారు. కొంత మంది పోలీసులు టీడీపీకి కొమ్ముకాశారు అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో పూర్తిగా విఫలమయ్యారు. దాడులు, హింసాత్మక చర్యలు జరుగుతుంటే అడ్డుకోలేదు. వైసీపీ నేతలనే టార్గెట్ చేసి హౌస్ అరెస్ట్‌లు చేశారు. టీడీపీ నేతలను మాత్రం పట్టించుకోలేదు అని ఆయన మండిపడ్డారు.

Share this post

scroll to top