నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా?

sleep.jpg

నిద్రపట్టడం లేదా? మంచి నిద్ర కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదా? అయితే, కొన్ని హెర్బల్ డ్రింక్స్ తీసుకోవడం ద్వారా మంచి నిద్రను పొందవచ్చు. ప్రతిరోజూ మీ దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా ప్రశాంతత, విశ్రాంతిని పొందవచ్చు. మెరుగైన నిద్రను ప్రోత్సహిస్తాయి. మంచి నిద్ర కోసం ఈ కింది హెర్బల్ డ్రింక్స్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

*నిద్రకు ముందు లావెండర్ టీ తాగడం వల్ల మనస్సు, శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. తద్వారా మంచి నిద్ర పడుతుంది. నిద్రకు ఒక గంట ముందు ఈ టీని తీసుకోవడం మంచిది. లావెండర్ టీ కూడా యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. జీర్ణ సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా సాయపడుతుంది.

*పిప్పరమింట్ టీ రిఫ్రెష్‌గా ఉండటమే కాదు.. మీ కండరాలను రిలాక్స్ చేయడంలో సాయపడుతుంది. అలాగే, టెన్షన్‌ను తగ్గించగలదు. తద్వారా మంచి నిద్ర పడుతుంది. నిద్రపోయే ఒక గంట ముందు సాయంత్రం ఈ టీని సేవించడం ఉత్తమం. పిప్పరమింట్ టీ కూడా జీర్ణక్రియకు సాయపడుతుంది.
*అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, డైజెస్టివ్ గుణాలు ఉన్నాయి. కండరాలను రిలాక్స్ చేయడంతో పాటు మంచి నిద్రను ప్రేరేపిస్తుంది. నిద్రించే ముందు అల్లం టీ తాగడం వల్ల అజీర్ణం, ఉబ్బరం తగ్గుతుంది. ప్రశాంతమైన నిద్ర పోవచ్చు.
*పాలు, దాల్చినచెక్క, అల్లం వంటి ఇతర సుగంధ ద్రవ్యాలతో పసుపు కలపాలి. అప్పుడు గోల్డెన్ మిల్క్ మాదిరిగా మారుతాయి. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. మంచి నిద్రను అందిస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. నిద్రపోయే ముందు ఈ పసుపు పాలు తాగడం వల్ల వాపు తగ్గుతుంది. నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.

Share this post

scroll to top