వేసవిలో టీ తాగితేనే మంచిది..

Tea-for-health.jpg

వేసవిలో టీ తాగితే వేడి చేస్తుందని చాలా మంది.. టీ తాగడం తగ్గించేస్తారు. అంతే కాకుండా ఎక్కువ శాతం చల్లటి పదార్థాలు డ్రింక్స్, వాటర్, ఐస్ క్రీమ్ వంటివి తీసుకుంటారు. వీటి వల్ల బాడీ చల్లగా అవుతుందటి అపోహ పడతారు. కానీ నిజానికి చల్లటి పదార్థాలు బాడీ హీట్‌ను తగ్గించడం కాకుండా పెంచుతాయట. అయితే వేడి పదార్థాలు మాత్రం బయట వేడికి అనుగుణంగా బాడీ టెంపరేచర్‌ను కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తాయంటున్నారు నిపుణులు.

చల్లటివి తీసుకోవడం వల్ల ఆ క్షణం బాగానే ఉన్నప్పటికి తర్వాత వాటి వల్ల బాడీలో వేడి పెరగడంతో పాటు.. కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. అయితే.. టీ తాగడం వల్ల బయట ఉన్న ఉష్ణోగ్రతలతో పోల్చితే శరీరం చల్లబడ్డట్లుగా ఫీల్ అవుతారట. వేసవిలో చల్లటి పదార్థాల కంటే వేడి పదార్థాలే శరీరాన్ని చల్లబురుస్తాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే.. ఏదైనా మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచి చేస్తుంది.

Share this post

scroll to top