రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర టీ తాగండి..

Coriander-tea.jpg

చాలా మందికి పొద్దున్నే టీ తాగే అలవాటు ఉంటుంది. చాలా మంది ఉదయాన్నే పాలతో చేసిన టీ, కాఫీలను ఎక్కువగా తాగుతుంటారు. కానీ, కొందరు గ్రీన్ టీ తాగితే, మరికొందరు లెమన్ టీ లేదా బ్లాక్ టీ తాగుతుంటారు. కొత్తిమీర ఆకులు సాధారణంగా దాదాపు ప్రతి ఇంట్లో ఉపయోగిస్తారు. కొత్తిమీరను అన్ని వంటల్లోనూ చివరగా వేస్తుంటారు. కొత్తమీరతో ప్రత్యేకించి చట్నీ కూడా తయారు చేస్తారు. ఇది ఆహారం రుచిని మరింతగా పెంచుతుంది.

కొత్తిమీర ఆకులలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పార్కిన్సన్స్, అల్జీమర్స్, మల్టిపుల్ స్క్లెరోసిస్‌తో సహా అనేక మెదడు వ్యాధుల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. దీని ఆకులను ఉడకబెట్టి టీ తయారు చేసి తాగడం వల్ల మెదడుకు తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఒత్తిడి స్థాయిని తగ్గిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును తగ్గించడంలో కొత్తిమీర టీ కూడా బాగా సహాయపడుతుంది. దీన్ని తాగడం వల్ల మెటబాలిజం పెరిగి బరువు తగ్గుతారు. దీని కోసం మీరు ఉదయం ఖాళీ కడుపుతో తాగితే ఫలితం ఉంటుంది.

Share this post

scroll to top