పెరుగు వర్సెస్ మజ్జిగ.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రయోజనకరం..?

Curd-OR-BUTTERMILK.jpg

మజ్జిగ కంటే పెరుగులో ఎక్కువ ప్రొటీన్లు ఉంటాయి. ప్రోటీన్ కండరాలను నిర్మించడానికి, రిపేర్ చేయడానికి సహాయపడుతుంది. పెరుగులో ఉండే బ్యాక్టీరియా పేగులకు చాలా మేలు చేస్తుంది. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

పెరుగు, మజ్జిగ రెండూ కాల్షియం మంచి మూలం. అనేక ముఖ్యమైన విటమిన్లు కలిగి ఉన్నాయి. పెరుగులో కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ B12, B5, B2 మరియు పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. అయితే మజ్జిగలో విటమిన్ B12, జింక్, రైబోఫ్లేవిన్, ప్రోటీన్లు సాపేక్షంగా అధిక మొత్తంలో ఉంటాయి.మీకు అజీర్ణం సమస్య ఉంటే, పెరుగు తినడం మంచిది.

పెరుగులో ఉండే బ్యాక్టీరియా జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. తక్కువ కేలరీల మజ్జిగ బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. మండే వేసవిలో మజ్జిగ చల్లగా తాగితే ఎండల నుంచి ఉపశమనం కలిగిస్తూ శరీరాన్ని చల్లబరుస్తుంది.

Share this post

scroll to top