ఏ పనీ చేయకపోయినా అరగంటకోసారి తీవ్రమైన అలసట వేధిస్తోందా?, శారీరక బలహీతకు గురవుతున్నారా? అయితే ఇది అడ్రినల్ ఫెటీగ్ అనే రుగ్మత కావచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే ఇటీవల అనేక మందిని ఈ సమస్య వేధిస్తున్నట్లు చెప్తున్నారు. ఎటువంటి వర్క్ చేయకపోయినా, ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోయినా నీరసించి పోవడం దీని ప్రధాన లక్షణం. మానవ శరీరంలోని కిడ్నీలపై భాగంలో ఉండే అడ్రినల్ గ్రంథులు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. అందుకే దీనిని అడ్రినల్ ఫెటీగ్ అని పేరుపెట్టారు.
అరగంటకో, గంటకో ఒకసారి ఏదో పెద్ద పనిచేసిన అనుభూతితోపాటు తీవ్రమైన అలసటను ఎదుర్కోవడం, ఒత్తిడిగా ఫీలవడం, నిద్రలేమి, తీపి, ఉప్పగా ఉండే ఆహారాలు ఎక్కువగా తినాలనిపించడం, బద్ధకంతో ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చోవడం లేదా పడుకోవడం దీని లక్షణాలు చెప్పవచ్చు.